Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్థానిక రామకృష్ణ మట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి మాట్లాడుతూ.. జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు మరియు పాల్గొనే హక్కులను అందరూ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని, ఈ రోజులలో పిల్లలపై జరుగుతున్న అరాచకాలు చాలా జరుగుతున్నాయని పిల్లలు అక్రమ రవాణా కు గురవుతున్నారని గురి అవుతుంది తెలిపారు. కావున వీటన్నింటినీ నిరోధించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఎస్కే రసూల్ బి మాట్లాడుతూ.. పిల్లలు ఎలాంటి వివక్షతలు గురికాకుండా వారి సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని పేర్కొనడం జరిగింది పిల్లల హక్కులను రక్షించే బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ.. పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని ఎలాంటి సమస్యలు ఎదురైనా దీటుగా ఎదిరించి విజయం సాధించాలని కోరారు. అనంతరం వివిధ ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. సాంస్కృత కార్యక్రమాలు అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అశ్విని సి డబ్ల్యూ సి సభ్యులు రాజేంద్రప్రసాద్ జేజే బి మెంబర్ శ్రీలత, డిసిపిఓ చైతన్యకుమార్, రిటైర్డెడ్ మాస్టర్ దారం గంగాధర్, జి సి డి ఓ భాగ్యలక్ష్మి, ఇందూరు యువత అసోసియేషన్ అధ్యక్షుడు సాయి బాబు డి సి పి యు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -