అంతర్జాతీయ యోగా దినోత్సవం..

నవతెలంగాణ – భువనగిరి
అంతర్జాతీయ యోగ దినోత్సవం 21వ తేది జూన్, 2024 పురస్కరించుకొని భువనగిరి కోర్టు ఆవరణలో యోగ కార్యక్రమం ఉ.7.30 గం. లకు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు స్వయంగా శీర్షాసనం వేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు . భువనగిరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ భోదకులు ఉప్పల రవి, చింత అనిల్ కార్యక్రమములో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు,  ఉద్యోగులతో యోగాసనాలు వేయించారు. శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ మెడిటేషన్ ధ్యాన బోధకులు చేపూరి నరసింహ చారి, నామోజు నరేష్ ధ్యానం చేయించారు.  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. శారీరక వ్యాయామం చేయాలని,  మానసిక వత్తిడిని యువత ఎదుర్కొలేకపోతుందని, ధ్యానంతో మనసును కట్టడి చేసి మంచి మార్గం వైపు పయనించాలని, మాదక ద్రవ్యాలు, నేర ప్రవృత్తి విడనాడాలని, యోగ, ధ్యాన కార్యక్రమాలు మరిన్ని చేసే విదంగా యోగ సంస్థలు తమ సేవలను విస్తృతపరచాలని కోరారు. బీబీనగర్ ఎస్. ఎల్. ఎన్. ఎస్ నేచర్ క్యూర్ వైద్యశాల డా. కార్తిక్ రెడ్డి ప్రకృతి మహా వైద్యశాలని, ప్రకృతి ధర్మాలను ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యాక్రమములో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి. మాధవిలత, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బి. హరినాథ్, కార్యదర్శి కె. కృష్ణ,జి. పి నాగారం అంజయ్య,  న్యాయవాదులు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది ఎస్. జైపాల్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. శంకర్,  ఉద్యోగులు పాల్గొన్నారు.
Spread the love