Tuesday, February 10, 2026
E-PAPER
Homeజాతీయంమ‌ణిపూర్‌లో ఇంట‌ర్‌నెట్ నిలిపివేత‌

మ‌ణిపూర్‌లో ఇంట‌ర్‌నెట్ నిలిపివేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌ణిపూర్‌లోని ఉక్ర‌ల్ జిల్లాలో ఓ రెండు గ్రామాల మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. గ్రామంలోని ప‌లు ఇండ్ల‌కు దుండ‌గులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో ప‌లు ఇండ్లు ద‌గ్ధ‌మైయ్యాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఆ రాష్ట్ర స‌ర్కార్.. ఉక్ర‌ల్ జిల్లా వ్యాప్తంగా ఇంట‌ర్ నెట్, మొబైల్ డేటాను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఐదు రోజుల పాటు ఇంట‌ర్ నెట్ పై ఆంక్ష‌లు ఉంటాయ‌ని మంగ‌ళ‌వారం వెల్లడించింది.

శాంతిభద్రతలను మరింత దిగజార్చేలా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్య తీసుకున్నారని అధికారులు తెలిపారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే చిత్రాలు, పోస్టులు మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది” అని ఉత్తర్వులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -