- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘కోల్ట్‌రిఫ్’ దగ్గు మందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 22 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో శ్రీసన్ ఫార్మా కంపెనీకి సంబంధమున్న 7 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. పీఎంఎల్‌ఏ(మనీలాండరింగ్) చట్టం కింద ఈ దాడులు చేశారు. తమిళనాడులోని సీనియర్ డ్రగ్ కంట్రోల్ అధికారుల నివాసాలు, శ్రీసన్ ఫార్మాకు సంబంధమున్న ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -