- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు గువాహటి వేదికగా తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమాన బలాబలాలతో ఉండటంతో హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 30 సార్లు తలపడగా, 16 విజయాలతో ముంబై ఇండియన్స్ పైచేయి సాధించింది. 2021 నుంచి జరిగిన 8 మ్యాచుల్లో రాజస్థాన్ 5 విజయాలు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉంటారని సమాచారం.
- Advertisement -



