నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌తో ఐపీఎల్ సీజన్ 18 పది రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత్ -పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత బీసీసీఐ రీ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో రేపట్నుంచి ఐపీఎల్ 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పోరుతో మళ్లీ బ్యాటర్ల విధ్వంసానికి తెర లేవనుంది. విదేశీ క్రికెటర్లు కొందరు టోర్నీకి దూరమైనా.. ప్లే ఆఫ్స్ పోరులో నిలిచేందుకు ఏడు జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశ ముగింపు దశకు వచ్చినందుకు ఇకపై ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
రేపట్నుంచే ఐపీఎల్ మెరుపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES