లక్నో సూపర్ జెయింట్స్ ప్రాక్టీస్
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియం ఆదివారం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనుంది. కోల్‌కతా నుంచి శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్న సన్‌రైజర్స్ విశ్రాంతి తీసుకోగా.. లక్నో సూపర్‌జెయింట్స్ క్రికెటర్లు గ్రౌండ్లో సాధన చేశారు. సాయంత్రం 4 గంటలకు స్టేడియానికి చేరుకున్న సూపర్‌జెయింట్స్ జట్టు రెగ్యులర్ కసరత్తులతో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేసింది. గత సీజన్లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన మహ్మద్ షమి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నాడు. నేడు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సైతం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయనున్నారు.
ఉప్పల్‌కు ఐపీఎల్ జోష్
- Advertisement -
- Advertisement -



