Tuesday, May 13, 2025
Homeఆటలు17 నుంచి ఐపీఎల్‌

17 నుంచి ఐపీఎల్‌

- Advertisement -

– ఆరు వేదికల్లో మిగిలిన 17 మ్యాచులు
– రీ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ
నవతెలంగాణ-ముంబయి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025 ఈ నెల 27 నుంచి పున ప్రారంభం కానుంది. భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తలతో ఐపీఎల్‌18ను వారం పాటు నిలిపివేస్తూ శుక్రవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ అంగీకారం కుదరటంతో ఐపీఎల్‌18లో మిగిలిన మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ సోమవారం రీ షెడ్యూల్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం, భద్రతా విభాగాలు సహా లీగ్‌ ప్రాంఛైజీలు, ప్రసారదారులతో చర్చించిన అనంతరం ఆరు వేదికల్లో ఐపీఎల్‌ను రీ స్టార్ట్‌ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. బెంగళూర్‌, జైపూర్‌, ఢిల్లీ, లక్నో, ముంబయి సహా అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌18లో మిగిలిన 17 మ్యాచులను నిర్వహించనున్నారు. మే 9న ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ అర్థాంతరంగా రద్దు కాగా..ఆ మ్యాచ్‌ను సైతం మళ్లీ నిర్వహించనున్నారు. ఈ నెల 17న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌తో లీగ్‌ రీ స్టార్ట్‌ కానుంది. ప్లే ఆఫ్స్‌ 29 నుంచి ఆరంభం కానుండగా.. జూన్‌ 3న ఫైనల్‌ జరుగనుంది. క్వాలిఫయర్‌1, ఎలిమినేటర్‌ మ్యాచులకు హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌కు కోల్‌కత ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. రీ షెడ్యూల్‌లో వేదికలను ప్రకటించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -