నవతెలంగాణ-హైదరాబాద్: తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ ప్లేయర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నయా లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు. ఈ నెల 28నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో ప్రాక్టిస్ సెషన్‌లో రోహిత్ శర్మ అండ్ కో నిమగ్నమైంది. ఈక్రమంలోనే ఆటగాళ్లను మర్యాద పూర్వకంగా కలువడానికి వచ్చిన ముంబాయి ఇండియన్ ఓనర్ నీతా అంబానీ హిట్ మ్యాన్‌ను చూసి షాక్‌కు గురైయ్యారు.
“ఓరి దేవుడా, రోహిత్, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నావు.” అని అన్నారు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. ఇందులో రోహిత్ శర్మ తన బరువును తగ్గి, ఫిట్‌నెస్‌పై ఎంతంగా దృష్టిపెట్టాడో కనిపిస్తోంది. రోహిత్ మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా, సన్నగా, చురుకుగా కనిపిస్తున్నాడు.



