Sunday, October 12, 2025
E-PAPER
Homeజాతీయంఐపీఎస్ అధికారి సూసైడ్‌: పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఐపీఎస్ అధికారి సూసైడ్‌: పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఉన్న‌తాధికారుల కుల‌వేధింపుల కార‌ణంగా అక్టోబ‌ర్ 7న‌ స‌ర్వీస్ రివ్వాల‌ర్‌తో కాల్చుకొని ఐపీఎస్ అధికారి వై.పూర‌న్ కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న చావుకు డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ల‌తో పాటు ప‌లువురు అధికారులు కార‌ణ‌మ‌ని సుదీర్ఘమైన సూసైడ్ నోట్ పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న‌పై పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ గులాబ్ చంద్ క‌ర్తారియా స్పందించారు. ఈ సంఘ‌ట‌న తీవ్ర‌మైన‌ది, పోలీసులు ఇప్ప‌టికే ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని, ఐపీఎస్ సూసైడ్ సంఘ‌ట‌న‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హాంగా ఉన్నార‌ని, ఐపీఎస్ అధికారిని ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న 10 నుంచి 15 ఉన్న‌తాధికారుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేసిన‌ట్టు మీడియా స‌మావేశంలో పేర్కొన్నారు. ఎస్పీని బ‌దిలీ చేశామ‌ని, డీజీపీని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్లు పెరిగిపోతున్నాయ‌ని, అని కోణంలో విచారించి చ‌ట్ట ప్ర‌కారం నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -