నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు ధీటుగా ఇరాన్ బదులిస్తున్నది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్నది. అయితే వార్ మొదలైన తొలి రోజుల్లోనే అమెరికాకు చెందిన కీలక రేడార్‌ను ఇరాన్ పేల్చివేసింది. జోర్డాన్‌లోని మువాఫక్ సల్టీ ఎయిర్‌బేస్ వద్ద ఉన్న ఏఎన్-టీపీవై-2 రేడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా నిర్ధారించారు. ఏఎన్-టీపీవై-2 రేడార్‌ను థాడ్ క్షిపణి బ్యాటరీగా వాడుతారు. శత్ర దేశ క్షిపణులు, డ్రోన్ల రాకలను ఈ రేడార్ పసికట్టి .. మిస్సైల్ వ్యవస్థకు సమాచారం ఇస్తుంది. అయితే జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉన్న అమెరికా మిస్సైల్ ఇంటర్‌సెప్టార్ రేడార్ కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అంచనా వేస్తున్నారు.
అమెరికా రేడార్‌ను పేల్చేసిన ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



