Saturday, November 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్ నిర్ణ‌యాన్ని ఖండించిన ఇరాన్‌

యూఎస్ నిర్ణ‌యాన్ని ఖండించిన ఇరాన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అణ్వాయుధ పరీక్షలను తిరిగి వెంటనే ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన ప్రకటనను ఇరాన్‌ ఖండించింది. ఈ ప్రకటన తిరోగమనం, బాధ్యతారాహిత్యం అని పేర్కొంది. ” ‘రక్షణ శాఖ’ను ‘యుద్ద విభాగం’గా మార్చిన తర్వాత, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఒక బెదిరింపు సంస్థ అణ్వాయుధాలను తిరిగి ప్రారంభిస్తోంది” అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి ఎక్స్‌లో పేర్కొన్నారు. ”అదే బెదిరింపుదారుడు ఇరాన్‌లోని శాంతియుత అణుకార్యక్రమాన్ని ప్రపంచానికి దెయ్యంగా చూపిస్తున్నాడు. మన రక్షిత అణు కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -