Saturday, April 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంAmerica - Iran war : అమెరికాకు ఇరాన్ గట్టి షాక్‌...

America – Iran war : అమెరికాకు ఇరాన్ గట్టి షాక్‌…

- Advertisement -

నవతెలంగాణ హైదారాబాద్: ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అమెరికాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలు ఇరాన్‌ కూల్చేసింది. మరో రెండు హెలికాప్టర్లపైనా దాడి చేసింది. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడగా.. మరో పైలట్‌ గల్లంతయ్యారు.

అమెరికాకు చెందిన ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగల్‌ విమానాన్ని ఇరాన్‌ శుక్రవారం దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్‌, వెపన్‌ సిస్టమ్‌ అధికారి ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే హర్మూజ్‌ సమీపంలో ఏ-10 వార్‌థగ్‌ ఫైటర్‌ జెట్‌ను ఇరాన్‌ కూల్చేసింది. దీని శకలాలు కువైట్‌లో పడగా.. అందులోని పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

కాగా.. మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్‌ కోసం రెండు బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. వీటిపైనా ఇరాన్‌ దాడిచేసినట్లు అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని ఇరాన్‌ గగనతలం నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సమాచారం ఇచ్చినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లివిట్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -