Thursday, March 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చ‌రిక‌

ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చ‌రిక‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీని ఇజ్రాయెల్ హత్య చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీనిపై ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.లారీజానీని ‘అమరవీరుడు’గా అభివర్ణించిన ఖమేనీ.. ఆయన రక్తం వృథా కాదన్నారు.

బుధవారం టెహ్రాన్‌లో లారీజానీ, సులేమానిల అంత్యక్రియలు అశేష జనసందోహం మధ్య జరిగాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలతో టెహ్రాన్ వీధులు దద్దరిల్లాయి. ఒకవైపు అమెరికా ‘బంకర్ బస్టర్’ బాంబులతో దాడులు చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అణు పరీక్షలకు సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -