Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధమే: ఇరాన్ విదేశాంగ మంత్రి

చర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధమే: ఇరాన్ విదేశాంగ మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ పేర్కొన్నారు. తాము యుధ్దాన్ని కోరుకోవడం లేదని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో యుద్ధానికైనా సిద్ధమేనని అన్నారు. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. రాజధాని టెహ్రాన్‌లో విదేశీ దౌత్యవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి ప్రకటించారు. ఆందోళనకారుల నిరసనలతో తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్‌ యత్నిస్తున్నారని అన్నారు. మరోవైపు సోమవారంతో ఇరాన్‌లో ఇంటర్నెట్‌పై నిషేధం 84 గంటల మార్కుకు చేరుకుందని పర్యవేక్షకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -