Sunday, March 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాతో చర్చలకు సిద్ధం..5 షరతులు పెట్టిన ఇరాన్

అమెరికాతో చర్చలకు సిద్ధం..5 షరతులు పెట్టిన ఇరాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే, చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలంటే అమెరికా తమ ఐదు షరతులను తప్పనిసరిగా అంగీకరించాలని స్పష్టం చేసింది.

ఇరాన్ విధించిన షరతుల్లో ప్రధానంగా.. తమ భూభాగంపై, ముఖ్యంగా ఇంధన వనరులపై అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని విధించిన వాణిజ్య, చమురు ఆంక్షలన్నింటినీ పూర్తిగా ఎత్తివేయాలని కోరింది. అలాగే, పశ్చిమాసియా ప్రాంతం నుంచి, ముఖ్యంగా తమ సరిహద్దుల నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.

వీటితో పాటు, యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ చమురు బావులు, ఇతర మౌలిక సదుపాయాలకు అమెరికా నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఖతార్, ఒమన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇరాన్ విధించిన ఈ షరతులపై వైట్ హౌస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. గతంలో ‘షరతులు లేని చర్చల’కు మాత్రమే సిద్ధమని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణ వంటి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించినా, నష్టపరిహారం వంటి డిమాండ్‌కు అమెరికా అంగీకరించడం కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -