నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ పేర్కొన్నది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఆ విమానం కూలినట్లు తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. పైలెట్ తీవ్రంగా గాయపడి ఉంటాడని, అతను బ్రతికి ఉండే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ కూల్చడం ఇది రెండో సారి అవుతుంది. అయితే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. ఇప్పటికే అమెరికా గట్టి పోటీ ఇస్తున్న ఇరాన్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రేడార్ డిటెక్షన్‌ను తప్పించుకునే స్టీల్త్ ఫైటర్ ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ కూల్చినట్లు వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
అమెరికాకు చెందిన మరో ఎఫ్-35ని కూల్చేశాం: ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



