Wednesday, April 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబహ్రెయిన్‌లో ఇరాన్ క్షిప‌ణి దాడులు

బహ్రెయిన్‌లో ఇరాన్ క్షిప‌ణి దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్ క్షిపణి దాడుల వల్ల బహ్రెయిన్‌లోని కీలకమైన టెలికమ్యూనికేషన్ హబ్‌లో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతం నుంచి దట్టమైన పొగలు కమ్ముకుంటున్న దృశ్యాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బటెల్కో బహ్రెయిన్ జాతీయ మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైన భాగం. ఈ టెలికాం హబ్‌పై జరిగిన దాడి దేశ భద్రత పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ.. బహ్రెయిన్ అధికారులు, బటెల్కో యాజమాన్యం గానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) నుంచి గానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -