Saturday, April 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిమానంలో చిన్నారుల ఫోటోల‌తో పాకిస్థాన్ కు ఇరాన్

విమానంలో చిన్నారుల ఫోటోల‌తో పాకిస్థాన్ కు ఇరాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధం సృష్టించిన మానవ విషాదానికి అద్దం పడుతూ.. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మరణించిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్విగ్నతకు కారణమైంది. ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్‌కు బయలుదేరిన విమానంలో ముందు వరుస సీట్లలో ఈ వస్తువులను ఉంచి, వాటిని యుద్ధ బాధితులకు ప్రతీకగా అభివర్ణించింది. “ఈ ప్రయాణంలో నా సహచరులు #Minab168” అంటూ ఘలీబాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో అందరినీ కలచివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -