నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై దాడులకు ట్రంప్ తాత్కాలిక బ్రేక్ ఇచ్చినా..ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్ దాడులను ఇరాన్ దీటుగా ఎదుర్కొంటుంది. ఈక్రమంలోనే గల్ప్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. దుబాయ్‌లోని పలు యూఎస్ ఆర్మీ స్థలాలపై దాడులు చేసినట్లు ఆ దేశ పార్సా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రహస్య స్థలాల్లో ఉన్నా యూఎస్ కు చెందిన 400మంది సైనికులు ఉన్నారని, ఆయా ప్రాంతాలపై ఐఆర్జీసీ క్షిపణులతో దాడి చేసిందని వెలువరించింది.
సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో అనేకమంది అమెరికా సైనికులు (US troops) గాయపడగా, యుద్ధ విమానాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హర్మూజ్ జలసంధి గుండా మానవతా సాయం, వ్యవసాయ సరకుల రవాణాను అనుమతించడానికి ఇరాన్ అంగీకరించింది.



