నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్-అమెరికా వైమానిక దాడులను ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటుంది. డ్రోన్లు, క్షిపణుల ప్రయోగాలతో యూఎస్‌కు చెందిన పలు విమానాలను కూల్చివేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అదే విధంగా ఇజ్రాయిల్ ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఈక్రమంలోనే ఓ క్షిపణితో దాడి చేసే ముందు వినూత్న రీతిలో ఇజ్రాయిల్‌కు కౌంటర్ ఇచ్చింది ఇరాన్. యుద్ధం ఇల్లీగల్, అమానుషమంటూ..మిస్సైల్ మీద స్టిక్కర్‌తో కూడిన రాతలు రాస్తూ నెతన్యాహును ఎద్దేవా చేసింది. ఆ తర్వాత సదురు క్షిపణిని ఇజ్రాయిల్ మీదకు పంపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినూత్న రీతిలో ఇజ్రాయిల్‌కు ఇరాన్ కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



