Tuesday, April 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌

ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్‌ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తీవ్ర ఆనారోగ్యం పాలయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి పోవడంతో ఇరాన్‌లోని ఖోమ్‌ నగరంలో ఓ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ అంచనా ప్రకారం ఈ విషయాన్ని మంగళవారం లండన్‌ మీడియా ది టైమ్స్‌ యుకే నివేదించింది.

కాగా, సుప్రీం నేత ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని అమెరికా- ఇజ్రాయిల్‌ ఇంటెలిజెన్స్‌ తన మిత్ర దేశాలకు సమాచారం అందించిందని యుకె మీడియా వెల్లడించింది. సర్వోన్నత నేత ఆచూకీని తొలిసారి వెల్లడించిన ఆ మెమోను తాము చూశామని టైమ్స్‌ పత్రిక వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -