– సీబీఐతో విచారణ జరిపించాలి : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ, దానిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల దోపిడీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నదా? లేక ప్రభుత్వం కళ్లుగప్పి ఈ తతంగం నడుస్తున్నదా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఓవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయనీ, మరోవైపు 15 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం చాలా మందగించిందని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గన్నీబ్యాగులు, టార్పాలిన్లు, లారీల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. ఐకేపీ కేంద్రాల ద్వారా జరగాల్సిన ధాన్యం కొనుగోళ్లను కొత్తగా పీఏసీఎస్, డీసీఎంఎస్‌లకు అప్పగించారనీ, అవి రాజకీయ నిరుద్యోగులకు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే సోయే సర్కారుకు లేదని విమర్శించారు. తేమ పేరుతో 40 కేజీల ధాన్యం బస్తా నుంచి నాలుగు కేజీల తరుగు తీయడాన్ని తప్పుబట్టారు. ఆ ధాన్యం ఎవరి జేబుల్లోకి పోతుందని ప్రశ్నించారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతున్నదని చెప్పారు.
టన్నుకు రూ. 22 వేల చొప్పున దాదాపు 13 లక్షల టన్నులకు రూ. 2,860 కోట్లు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఏ ట్యాక్స్ అని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన రూ. 760 కోట్లు బోనస్ ఎగవేసినట్లేనా? అని నిలదీశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న రైస్ మిల్లర్లు ఎవరు? ఇంకా వారికి ఎందుకు ధాన్యం పంపుతున్నారు? లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్న మిల్లర్ల నుంచి ఎందుకు రికవరీ చేయడం లేదు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES