ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం వద్ద రైతుల ధర్నా
నవతెలంగాణ -మిర్యాలగూడ
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ఎన్నెస్పీ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 560 అడుగుల నీరు చేరింద న్నారు. శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు రోజూ 50 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశమున్నందున ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి వానాకాలం సాగు పనుల్లో ఉన్న రైతులందరినీ ఆదుకోవా లని కోరారు. నీటి విడుదల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పాల్వాయి రామ్ రెడ్డి, మండల కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు పోలేపల్లి గోవింద్ రెడ్డి, గాయం వీరారెడ్డి, లిఫ్టు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పాదూరి శశిధర్ రెడ్డి, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు, నాయకులు రవి నాయక్, కోటిరెడ్డి, చౌగాని వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ వస్కుల సూర్యం, ఉన్నాం వెంకటేశ్వర్లు, వాడపల్లి రమేష్, సలీం పాషా పాల్గొన్నారు.
సాగర్ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES