Wednesday, October 1, 2025
E-PAPER
Homeఖమ్మంపండగ రోజు పస్తులేనా?

పండగ రోజు పస్తులేనా?

- Advertisement -

– సీఐటీయూ నేత అర్జున్

నవతెలంగాణ – అశ్వారావుపేట

దసరా పండగకు దినసరి కార్మికుల పిల్లలు దసరా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పటికీ గత ఐదు ఆరు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఉపవాసంతో గడపాల్సిన పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఐటీయూ ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పనిచేసే దినసరి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 20 రోజుకు చేరింది.

ఈ నేపథ్యంలో సమ్మె శిబిరంలో దినసరి కార్మికులు అర్థ నగ్నంగా మోకాళ్ళ పై నిలుచొని నినాదాలు ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బైట నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు ను చేస్తాం అని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి శ్రామిక మహిళలును పండుగ రోజూ పస్తులు ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మురారి రఘు,వేల్పుల అప్పారావు, దాసు, బుచ్చన్న, వెంకట్, రాజు, ఆదిలక్ష్మి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -