Friday, April 3, 2026
E-PAPER
Homeజాతీయంప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తే నేర‌మా?: ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తే నేర‌మా?: ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: పార్ల‌మెంట్‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే అవ‌కాశం వ‌చ్చింద‌ని, సాధార‌ణ ప్ర‌జ‌ల అంశాల‌ను ప్ర‌స్తావించేందుకు అవ‌కాశం త‌న‌కు వ‌చ్చింద‌ని, అయితే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌డం నేరం అవుతుందా అని ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ఆమ్ ఆద్మీ పార్టీని ప్ర‌శ్నించారు.రాజ్యస‌భ ఉప‌నేత ప‌ద‌వి నుంచి ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha)ను ఆమ్ ఆద్మీ పార్టీ తొల‌గించిన విష‌యం తెలిసిందే. అత‌నికి మైక్ ఇవ్వ‌వొద్దు అంటూ రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్‌కు ఆ పార్టీ లేఖ రాసింది.

ఈ అంశంపై ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా స్పందించారు. త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.నేనేమైనా నేరం చేశానా, పొర‌పాటు చేశానా, త‌ప్పు చేశానా అని అన్నారు. పార్ల‌మెంట్‌లో త‌న‌ను మాట్లాడ‌నివ్వొద్ద‌ని రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్‌కు ఆప్ చెప్పింద‌ని, అందుకే తాను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు రాఘ‌వ్ తెలిపారు. త‌న గొంతును నొక్కేశార‌ని, కానీ త‌న‌ను ఓడించ‌లేర‌ని ఆయ‌న అన్నారు. ఆమ్ ఆద్మీల‌కు సందేశం ఇస్తున్న‌ట్లు ఆ వీడియోలో ఆయ‌న పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -