Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంఆ డీల్‌పై ట్రంప్, మోడీ ట్వీట్లు చేసుకుంటే స‌రిపోతుందా: ఎంపీ శ‌శిథ‌రూర్

ఆ డీల్‌పై ట్రంప్, మోడీ ట్వీట్లు చేసుకుంటే స‌రిపోతుందా: ఎంపీ శ‌శిథ‌రూర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ శ‌శిథ‌రూర్ యూఎస్-ఇండియా డీల్ పై సెటైర్లు వేశారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్, పీఎం మోడీ ప‌ర‌స్ప‌ర కామెంట్ల‌తో ప్ర‌శంసించుకుంటే స‌రిపోతుందా, ఒప్పందం గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని హితువు చెప్పారు. భార‌తీయ వ‌స్తువుల‌పై 18శాతం టారిఫ్‌లు త‌గ్గించిన విష‌యం ఆశాజ‌న‌క‌మే కానీ, యూఎస్ డీల్ అంటే స్ప‌ష్టంగా వివ‌రించాల‌ని పార్ల‌మెంట్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ప్ర‌తిప‌క్షాలు డీల్‌పై క్లారిటీ కోరుతుంద‌ని, ఇరుదేశాల ఒప్పందం ఏంటో త‌మ‌కు తెలియ‌ద‌ని, ట్రంప్, మోడీ ఇరువురు క‌లిసి ట్వీట్లు చేసుకుంటే ఆమోదం పొందిన‌ట్లా, ప్ర‌జాస్వామ్య దేశాలంటే ఇదేనా అని ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు ఒప్పందం గురించి వివ‌రించాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని చెప్పారు.

ఈ ఒప్పందంతో భార‌త్ వ్యవసాయానికి ఎలాంటి రక్షణలు ఉన్నాయని ప్ర‌శ్నించారు. ఇది వ్యవసాయం కోసమేనని, 500 బిలియన్ డాలర్లు అని ట్రంప్ అంటున్నారు, ఇది శుభవార్త అయితే తాముకు కూడా ఆనందిస్తాం, కానీ యూఎస్-ఇండియా ట్రేడ్ డిల్‌పై త‌మ‌కు కేంద్రం స్పష్టత ఇవ్వాల‌ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -