Friday, May 16, 2025
Homeజాతీయందళితులతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమా? : మల్లికార్జున ఖర్గే

దళితులతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమా? : మల్లికార్జున ఖర్గే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ బీహార్‌లో దర్భాంగాలోని అంబేద్కర్‌ హాస్టల్‌కి వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నితీష్‌కుమార్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. బీహార్‌లో జెడియు – బిజెపి ప్రభుత్వం శిక్ష న్యారు సంవాధ్‌ కార్యక్రమానికి హాజరుకాకుండా ప్రయత్నించిందని ఆయన అన్నారు. రాహుల్‌ దళిత, అణగారిన వెనుకబడిన వర్గాల తరగతుల విద్యార్థులతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమా? వారి విద్య, నియామక పరీక్షలు, ఉద్యోగాల గురించి వారితో మాట్లాడడం తప్పా? రాహుల్‌ని శిక్ష న్యారు సంవాద్‌ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం జెడియు- బిజెపి ప్రభుత్వం యొక్క నియంతృత్వానికి పరాకాష్ట. ప్రజాస్వామానికి పుట్టినిల్లు అయిన బీహార్‌ ఈ అన్యాయాన్ని గుర్తుంచుకుంటుంది. సమయం వచ్చినప్పుడు జెడియు- బిజెపికి తగిన సమాధానం ఇస్తుంది అని ఖర్గే ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, గురువారం దర్బాంగాలో జరిగిన ఒక సభలో రాహుల్‌ గాంధీ బీహార్‌లో జెడియు-బిజెపి ప్రభుత్వాన్ని డబుల్‌ ఇంజిన్‌.. దోకేబాజ్‌ సర్కార్‌గా అభివర్ణించారు. అంబేద్కర్‌ హాస్టల్‌కి వెళ్లాలన్నా.. పోలీసులు అడ్డుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మైనార్టీలకు వ్యతిరేకమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -