- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్‌ను మెటా బ్లాక్ చేయడంతో అతడిపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత కరాటే కళ్యాణి స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానెల్ సహా అన్నీ అకౌంట్లను డిలీట్ చేయించాలని సీపీ సజ్జనార్‌ను కలవబోతున్నామని చెప్పారు. అలాగే పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరతామన్నారు. హిందువులను అన్వేష్ అవమానించారని, అతడికి జైలుశిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -



