Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్“సబ్కా సాథ్, సబ్కా వికాస్” అంటే ఇదేనా?

“సబ్కా సాథ్, సబ్కా వికాస్” అంటే ఇదేనా?

- Advertisement -

– దళితుల హక్కులపై బీజేపీ అసలైన మజిలీ బయటపడింది!
– డా. రేఖ బోయలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహారాష్ట్రలో దళిత సంక్షేమ నిధులపై బీజేపీ ఎమ్మెల్యేలు మిగతా పార్టీలతో కాదు – ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. దేశ ప్రజలు ఈ ఘటనను ఆలోచించాల్సిన సమయం ఇది. ₹36 కోట్ల దళిత నిధుల విషయంలో జరిగిన ఈ దౌర్జన్యం, బీజేపీకి “దళిత సాధికారత” అనే మాటలు కేవలం ఓటు రాజకీయాల స్క్రిప్ట్ మాత్రమేనని నిరూపిస్తోంద‌ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి అన్నారు.
అభివృద్ధి పేరుతో బడా కార్పొరేట్‌లకు వేల కోట్లు, కానీ దళితుల సంక్షేమ నిధులపై మాత్రం కొట్లాట! ఇదేనా బీజేపీ అభివృద్ధి మోడల్?
ఇలాంటి వ్యూహాలపై బీజేపీకి ఇక ప్రజల మద్దతు అర్హత లేదు. నిధులు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాల్సింది కానీ రాజకీయ ఆధిపత్య పోరాటాలకు కాదు. ఈసారి దళితులు బీజేపీకి ఓటుతోనే సమాధానం చెబుతారు. వికాస్ మాటల్లో కాదు చేతల్లో కనిపించాల‌న్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad