నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో యుద్ధ విరమణకు ఇజ్రాయిల్ అంగీకారం: ట్రంప్
నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలో యుద్ధ విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించిందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సోమవారం వాషింగ్టన్ వేదికగా జరిగిన కీలక భేటీలో అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ప్రధాని నెతన్యాహు దాదాపు అంగీకరించారని ఆయన వెల్లడించారు. దీంతో తక్షణమే కాల్పుల విరమణ అమలోకి వస్తుందన్నారు. హమాస్ కూడా తమ ఒప్పందాన్ని అంగీకరిస్తే గాజా-ఇజ్రాయిల్ యుద్ధం ముగిసినట్లేనని ఆయన దీమా వ్యక్తం చేశారు.
కాగా,పశ్చిమాసియాలో త్వరలో యుద్ధం ముగియబోతోందని అంతకుముందు ట్రంప్ ధీమాగా చెప్పారు. గాజాలో పరిణామాలపై సోమవారం ట్రంప్, నెతన్యాహు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడి ఒత్తిడి మేరకు ఖతార్ ప్రధాని అబ్దుల్ రహమాన్ బిన్ జస్సిమ్ అల్ థానికి నెతన్యాహు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో నెతన్యాహు దిగివచ్చారు.