- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్‌లను ప్రయోగించామని హెజ్‌బొల్లాకు చెందిన అల్ మనార్ నెట్‌వర్క్ ప్రకటించిన తర్వాత ఈ దాడులు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని దక్షిణ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు లెబానాన్ జాతీయ మీడియా తెలిపింది. మరోవైపు ఈ దాడులను ఐడీఎఫ్ ధ్రువీకరించింది. రాత్రి హెజ్‌బొల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని.. లెబనాన్ రాజధానిపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించింది.
- Advertisement -



