నవతెలంగాణ-హైదరాబాద్: పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ వైమానిక దాడికి 22 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని రెస్క్యూ సిబ్బంది సోమవారం తెలిపారు. ప్రధానంగా గాజాలో దక్షిణ ప్రధాన నగరమైన ఖాన్ యూనిస్‌తోపాటు చుట్టుపక్కల ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల వల్ల 11 మంది మృతి చెందారని, అనేమంది గాయాలపాలయ్యారని పౌర రక్షణ సంస్థ ప్రతినిధి మహమూద్ బస్సాల్ తెలిపారు. అలాగే అబాసాన్‌లో మరొకరు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. జబాలియా పట్టణానికి పశ్చిమాన ఉన్న మార్కెట్ సమీపంలో జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు మృతి చెందారు. గాజా మధ్యలో ఉన్న నుసెయిరాట్‌లో ఉన్న గుడారంపై వైమానిక దాడికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఉత్తరాన ఉన్న గాజా నగరంలో జరిగిన దాడికి ఒకరు చనిపోయారు. ఇదిలా ఉండగా గాజ స్ట్రిప్ అంతటా దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం సోమవారం వెల్లడించింది.
పాలస్తీనాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి.. 22 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES