Friday, May 16, 2025
Homeఅంతర్జాతీయంగాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గురువారం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 80 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ నగరంలో జరిగిన దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 54 మంది మరణించినట్లు నాసర్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల కారణంగా గాజాలో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందించే ఏకైక ఆసుపత్రి అయిన గాజా యూరోపియన్ హాస్పిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆసుపత్రి మౌలిక వసతులు, మురుగునీటి లైన్లు దెబ్బతినడంతో పాటు, అంతర్గత విభాగాలు ధ్వంసమయ్యాయని, ఆసుపత్రికి దారితీసే రహదారులు నాశనమయ్యాయని వారు వివరించారు. గాజా నగరం మరియు ఉత్తర గాజాలోని ఇతర ప్రాంతాలపై జరిగిన దాడుల్లో మరో 26 మంది మరణించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -