- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గాజా-ఇజ్రాయిల్ మధ్య చర్చలతో యుద్ధం ముగిసినా..కాల్పులు మోత ఆగడం లేదు. ఇటీవలె బోర్డు ఆప్ పీస్‌లో సభ్యుత్వం ఉన్న ఇజ్రాయిల్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. శనివారం ఆ దేశ సైన్యం జరిపిన కాల్పుల్లో 12మంది పాలస్తీనియన్లు మరణించారు. అందులో సగానికిపైగా చిన్నారులు ఉన్నారు. గాజా స్ట్రీప్‌లో ఖాన్ యూనిస్ నగరానికి వాయువ్యంగా ఉన్న మావాసి ప్రాంతంలో.. నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న ఒక టెంట్‌పై శనివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో.. ముగ్గురు పిల్లలు సహా కనీసం ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారని వైద్య వర్గాలు అల్ జజీరాకు తెలిపాయి.
- Advertisement -



