Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హౌతీల ప్రధానమంత్రి మృతి

ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హౌతీల ప్రధానమంత్రి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించగా, ఈ దాడిలో హౌతీల ముఖ్య నేత అహ్మద్‌ అల్‌-రహావీ మృతి చెందారు. హౌతీల నియంత్రిత ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్న అహ్మద్‌ అల్‌-రహావీతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని హౌతీలు ధ్రువీకరించారు.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు ఈ వారం మొదట్లో రాజధాని సనా ప్రాంతంలో జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 10 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని హౌతీలు వెల్లడించారు. యెమెన్ రాజధాని సనాలో హూతీ పాలకుల సైనిక స్థావరమే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో కీలక వ్యక్తులను హతం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ప్రధాని అహ్మద్ అల్ రహావీతో పాటు పలువురు మంత్రులు మృతి చెందినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ప్రభుత్వ సభ్యులు, మంత్రులతో ప్రధాని సమావేశం జరుపుకుంటున్న సమయంలో ఈ దాడులు జరిగాయని వారు వెల్లడించారు.

2024 ఆగస్టు నుంచి రహవీ హౌతీల నియంత్రిత ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌ మద్దతుతో యెమెన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న హౌతీలు గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనీయన్లకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రహావీ హతమవ్వడం హౌతీ ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad