Thursday, July 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు..82మంది మృతి

గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు..82మంది మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గాజాపై బుధవారం రాత్రి ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో 82మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న 38 మంది ఉన్నారని వెల్లడించింది. పాలస్తీనియన్లకు ఆహారం అందించేందుకు ఇజ్రాయిల్‌ మద్దతుతో కొత్తగా ప్రారంభమైన అమెరికా సంస్థ అయిన గాజా హ్యూమన్‌టేరియన్‌ ఫౌండేషన్‌ వెలుపల సాయం కోసం వేచివున్న ఐదుగురు మరణించగా, గాజాస్ట్రిప్‌లోని ఇతర ప్రదేశాలలో సహాయ ట్రక్కుల వెలుపల సాయం కోసం చూస్తున్న 33 మంది మరణించారని ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది.

బుధవారం రాత్రి, గురువారం ఉదయం జరిగిన వైమానిక దాడుల్లో 12 మంది మరణించారని, మువాసీ జోన్‌లో శిబిరాలపై జరిగిన దాడుల్లో 15మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరాల్లో నిరాశ్రయులైన పలువురు పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారని అన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై కూడా దాడి జరిగిందని అన్నారు.

గల్లంతైన 232 మంది సహా గాజాలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 57,000 దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది.

ఇజ్రాయిల్‌ దాడులు గాజాను శిథిలావస్థకు చేర్చాయి. అధికభాగం నేలమట్టమైంది. గాజాలోని 2.3 మిలియన్ల జనాభాలో 90శాతం కంటే ఎక్కువమంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం గాజాలో మానవ సంక్షోభానికి కూడా దారితీసింది. లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు.

నాడు కులీ కుదుబ్ షాహీలు హైదరాబాద్ సిటీని నిర్మిస్తే..నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ నిర్మించారని అన్నారు.ఆ తర్వాత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు సైబరాబాద్ మూడో సిటీని నిర్మించారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతుందని అన్నారు సీఎం రేవంత్. మహేశ్వరంలో నియోజకవర్గం పరిధిలో 30 వేల ఎకరాలతో ప్రపంచంలోని అధునాతమైన నగరం నిర్మాణం కాబోతోందని అన్నారు సీఎం రేవంత్.

తెలంగాణలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. మలబార్ తయారీ యూనిట్ ను మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని.. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్.

ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదని.. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. తెలంగాణపై నమ్మకం ఉంచిన మలబార్ గ్రూప్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు సీఎం రేవంత్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -