Thursday, July 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసిరియా ఆర్మీ స్థావ‌రాల‌పై ఇజ్రాయిల్ దాడి

సిరియా ఆర్మీ స్థావ‌రాల‌పై ఇజ్రాయిల్ దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయిల్‌ సైన్యం బాబు దాడికి పాల్పడింది. అలాగే దక్షిణ నగరమైన సువేదాలో సిరియా దళాలపై మరిన్ని దాడులు ప్రారంభించింది. ఈ దాడులపై సిరియా రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది.

‘దాడులు జరిగే కొన్ని నిమిషాల ముందు మాపై అనేక డ్రోన్లు తిరుగుతున్న శబ్దాన్ని విన్నాము. ఈ డ్రోన్ల దాడిని తిప్పికొట్టడానికి.. రక్షణశాఖ ప్రయత్నించింది. డ్రోన్లవైపు రక్షణ దళాల నుండి కాల్పలు జరిపాయి’ అని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

మరోవైపు ఇజ్రాయిల్‌ గాజాపై జరిపిన తాజా దాడుల్లో 21 మంది మృతి చెందారు. దక్షిణ గాజాలో వివాదాస్పద అమెరికా ఇజ్రాయిల్‌ మద్దతుగల జిహెచ్‌ఎఫ్‌ ఆహార పంపిణీ కేంద్రంలో 21 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -