- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించినప్పటికీ పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో జరిపిన దాడుల్లో ఒక యువకుడు సహా ఇద్దరు పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగినట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందం నాటి నుండి ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 236కి పెరిగింది. గాజా నగరంలో శోధన ఆపరేషన్ తర్వాత హమాస్ మరో ముగ్గురు బందీల మృతదేహాలను ఇజ్రాయిల్‌కు అప్పగించిందని అన్నారు.
- Advertisement -



