- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ సైన్యం గాజాపై చేసిన దాడుల వల్ల గడచిన 24 గంటల్లో 28 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 8 మంది ఉన్నారని గాజా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్ గాజాపైనే కాదు.. యెమెన్‌పైనా దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు యెమెన్‌లోని సనా విమానాశ్రయంపై బాంబు దాడి చేశాయి. ఇజ్రాయిల్ ఇలా దాడికి పాల్పడడం ఈ నెలలో వరుసగా ఇది రెండోసారి.
- Advertisement -