నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ అమానుష దాడులను కొనసాగిస్తోంది. శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో సుమారు 66 మంది మరణించారని అధికారులు తెలిపారు. గాజా ఎన్‌క్లేవ్‌లోని దెబ్బతిన్న ఆస్పత్రులకు చెందిన వైద్యులు మాట్లాడుతూ.. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోందని అన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణను అంగీకరించేలా హమాస్‌పై ఒత్తిడిని పెంచేందుకు యత్నిస్తోందని అన్నారు. మువాసి ప్రాంతంలో నిరాశ్రయులైన కుటుంబాలకు ఆశ్రయం కల్పిస్తున్న ఇళ్లు మరియు గుడారాలపై శనివారం రాత్రి జరిగిన బహుళ వైమానిక దాడుల్లో సుమారు 20మంది మరణించారని దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో నాజర్ ఆస్పత్రి తెలిపింది. జబాలియా శరణార్థి శిబిరంలోని ఒక నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారని ఆరోగ్య శాఖ అత్యవసర సేవల విభాగం తెలిపింది. జబాలియాలోని మరో నివాసంపై దాడిలో ఏడుగురు పిల్లలు సహా పది మంది మరణించారు. రెండు వేర్వేరు దాడుల్లో సుమారు 10 మంది మరణించినట్లు సెంట్రల్ గాజాలోని డీర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా అమరవీరుల ఆస్పత్రి తెలిపింది. జ్విదా పట్టణంలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు సహా ఏడుగురు మరణించినట్లు తెలిపింది. డెయిర్ అల్-బలాహ్‌లోని చిన్నారి సహా ఆమె తల్లిదండ్రులు మరణించారని పేర్కొంది.
గాజాపై ఇజ్రాయిల్ అమానుష దాడి…66 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES