Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంకేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గం

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గం

- Advertisement -

అ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు లకావత్‌ గిరిబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం టౌన్‌:కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలను అమలు చేయాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గమని వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు లకావత్‌ గిరిబాబు అన్నారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే విధంగా అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఎంతో అద్భుతంగా హైదరాబాద్‌ నగరంలో ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహించడం జరిగిందన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కక్షసాధింపు చర్యలు చేపడుతూ ఏదోరకంగా కేటీఆర్‌ను కేసులో ఇరికించాలని, ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నాడన్నారు. ఇలాంటి బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి చేసింది ఎవరో అవినీతి చేస్తున్నది ఎవరో తప్పకుండా వాస్తవాలు త్వరలో బయటికి వస్తాయని గిరిబాబు అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad