నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) బోనాలు – 2025 పోస్టర్‌ను ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. టీహబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ ఈనెల 6న ఐటీ బోనాల జాతరను నిర్వహించనున్నారు. శిల్పకళా వేదిక నుంచి చిన్న పెద్దమ్మ ఆలయానికి భక్తిశ్రద్ధలతో ఊరేగింపు చేపడతారు. ఈ వేడుకలో 21 ఐటీ కంపెనీలకు చెందిన 1,500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ భాగస్వామ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీటా గ్లోబల్ అధ్యక్షుడు సుందీప్ కుమార్ మక్తాలా, బోనాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈనెల 6న ఐటీ బోనాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES