నవతెలంగాణ హైదరాబాద్: బాలల భవిష్యత్తుకు తోడుగా ముందుకు వచ్చిన సెక్యూర్ ఎక్స్‌పర్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండియా), పిఆర్ వేర్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంవి టెక్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐటీ సంస్థలు ( ఇండియా-యూకె) బాలల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఆదర్శ ఫౌండేషన్ వద్ద ఉన్న చిన్నారుల అవసరాన్ని తెలుసుకొని వారికి కంపెనీల యాజమాన్యం వారి టీంతో కలిసి యూనిఫార్మ్‌లు, నెలకు సరిపోయే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రోజంతా వారితో ఉల్లాసంగా గడుపుతూ కలిసి భోజనం చేశారు. పిల్లల చదువు, ఆరోగ్యం, అభివృద్ధికి తమ వంతు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటామని చెబుతూ ఈ సాయం చేయడం వారికి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మరెందరికో స్ఫూర్తిగా మారాలని వారు ఆశిస్తున్నారు.




