Sunday, December 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫామ్‌హౌజ్‌లో చలి ఎక్కువైంది..అందుకే కేసీఆర్ బయటకొచ్చారు

ఫామ్‌హౌజ్‌లో చలి ఎక్కువైంది..అందుకే కేసీఆర్ బయటకొచ్చారు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో చలి ఎక్కువైందని.. అందుకే కేసీఆర్ బయటకు వచ్చారని విమర్శించారు. తాము ప్రతిపక్షం ఉండొద్దని ఏనాడూ కోరుకోలేదని.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకున్నామని అన్నారు. కానీ.. కేసీఆరే ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యారని తెలిపారు. తెలంగాణ నేల.. కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి చాలా ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా కేసీఆర్‌పై మాట్లాడారు. కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో మేం 70 శాతం గెలిచామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్ రావు తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలు ఏర్పడ్డాయని వృథా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చులు చేశారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -