Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంప్రజా క్షేమం చూడటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత: ఎమ్మెల్యే జారే

ప్రజా క్షేమం చూడటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత: ఎమ్మెల్యే జారే

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజకవర్గ  ప్రజలకు అండగా నిలబడటం ప్రజాప్రతినిధిగా నా భాద్యత అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలోని దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాను ముందడుగు వేస్తున్నామని ఆన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలలో అనారోగ్యంతో ప్రయివేట్ ఆస్పత్రులలో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీలను ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయించి గురువారం ఆయన హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి విభాగంలో 245 అప్లికేషన్లను స్వయంగా అధికారులకు అందజేశారు. సంబంధిత బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాల్సిందిగా అధికారులను కోరారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉండడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img