– చండూరు మాజీ జడ్పీటిసి కర్నాటి వెంకటేశం
నవతెలంగాణ- చండూరు
ఇటీవల నూతన సర్పంచ్ గా గెలుపొందిన నామని జగన్నాధం ప్రమాణస్వీకారం రోజున నా మీద వ్యక్తిగత రాజకీయ ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని మాజీ జడ్పీటిసి కర్నాటి వెంకటేశం ఆరోపించారు. గురువారం గట్టుప్పల మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారిక ప్రమాణస్వీకారం రోజున సర్పంచ్ గ్రామంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు చెప్పకుండా తన మీద రాజకీయ ఆరోపణలు చేయడన్నీ తీవ్రంగా ఆయన ఖండించారు,సర్పంచ్ ఎన్నికల్లో అధికంగా ఖర్చు అయ్యాయని డిఫ్రెషన్ లోనయ్యి విమర్శలు చేస్తున్నారని అన్నారు గతంలో సర్పంచ్ ఉన్న నామని జగన్నాధం ఫార్మ కంపెనీ కి డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చిన చరిత్ర వారిదని మండిపడ్డారు.
గతంలో పార్టి కి కట్టుబడి ఉండి మా సొంత అన్నాని కాదని నిన్ను గెలిపించిన చరిత్ర తమదని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల క్షేమం పట్ల నీకు ఏ మాత్రం శుత్తశుద్ది ఉన్న ఫార్మ కంపెనీ అనుమతులు రద్దు చేపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు పున్న కిషోర్ ,పున్న ఆనంద్, చిలుకురి ఆంజయ్య, తీరందాసు ఆనంద్, నారని జగన్, బొల్లెపల్లి వెంకటేశం, కర్నాటి శ్రీనివాస్, చేరుపల్లి క్రిష్ణ , దుబ్బాక మల్లేశం, గంజి కృష్ణయ్య పగిల్లా హనుమంతు, చేరుపల్లి నగేష్, నేలాంటి వెంకటేశం, కర్నాటి విరేశం, కుకూడాల స్వామి, కమ్మం రాజశేఖర్ నరేష్ కుకూడాల వినోదు, దోర్నాల బాలక్రిష్ణ, చిలువేరు అయోధ్య, ఏలే నాగేశ్వరరావు, పున్న స్వామి, తదితరులు పాల్గొన్నారు.



