Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంతెలంగాణ మహిళలతో కాళ్లు కడిగించడం అవమానకరం

తెలంగాణ మహిళలతో కాళ్లు కడిగించడం అవమానకరం

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిస్‌ వరల్డ్‌ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడమే అవమానకరమైన విషయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. మిస్‌వరల్డ్‌ పోటీదారుల వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా పూరి గుడిసెలను మొత్తం ధ్వంసం చేసి వీధి వ్యాపారుల్లే కుండా చేసే కార్యక్రమానికి పాల్పడటం సరైంది కాదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు హాజరైన వారి కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించడం, తుడిచే కార్యక్రమానికి పూనుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి దిగజారిన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నదని తెలిపారు. ఈ మొత్తం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -