Friday, October 3, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించడం సరికాదు..

ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించడం సరికాదు..

- Advertisement -

సరైన ఆధారాలు ఉంటే సహకరిస్తాం..
భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలి..
మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి: ఎఫ్ ఆర్ ఓ  శ్రీధర్ ఆచారి
నవతెలంగాణ -జన్నారం

ప్రభుత్వ భూములను ఆక్రమించడం సరికాదని మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి ఎంపీడీవో ఉమర్ షరీఫ్  ఎఫ్ ఆర్ వో శ్రీధర్ ఆచారి అన్నారు. మంగళవారం మండలంలోని జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇంధన్ పల్లి రేంజ్, కవ్వాల్ సెక్షన్ అటవీ ప్రాంతంలో ఉన్న పాల గౌరీ అటవీ భూముల్లో జైనూర్  సిర్పూర్ మండలాలకు చెందిన గిరిజనులు వచ్చి గుడిసెలు వేసుకున్న సందర్భంగా ప్రదేశానికి వెళ్లి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గిరిజనుల వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా, రికార్డు కాగితాలు ఉన్న తమకు చూపిస్తే  తగిన సహకారం అందిస్తామని వారికి తెలిపారు. కానీ అనవసరంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి అడవులను నరుకుతామంటే ఊరుకునే సమస్య లేదని  ఇది సరైంది కాదని వారికి విన్నవించారు. ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి  తమ పాత ప్రదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్  ఆర్ఐ భాను చందర్  ఇతర అటవీశాఖ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -