– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను అడ్డుకోవాలి
– భారత్, పాకిస్తాన్ యుద్ధ సమయంలో అందాల పోటీలా?
– 20న దేశవ్యాప్త సమ్మె, 30న వ్యకాస ధర్నాలకు సీపీఐ(ఎం) మద్దతు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
రష్యాలో హిట్లర్ ఫాసిజాన్ని, సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించి ఎర్రజెండా ఎగిరిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ప్రపంచ దేశాలను ఆక్రమించుకోవాలన్న హిట్లర్ దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్ట వేసిందన్నారు. రష్యాలో అడుగుపెట్టకుండా సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం అడ్డుకొని కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చింద ని గుర్తు చేశారు. సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడారు. నియంత హిట్లర్ ప్రపంచంలోనే ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించు కుంటూ రష్యాను కూడా ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని 1945లో సోవియట్ యూనియన్, కమ్యూనిస్టు పార్టీల ఎర్రసైన్యం అడ్డుకట్ట వేశాయన్నారు. కమ్యూనిజాన్ని లేకుండా చేస్తాడని సామ్రాజ్యవాద దేశాలు, పెట్టుబడి దారులు.. హిట్లర్ నాజీయిజాన్ని పెంచి పోషించాయని తెలిపారు. ఆయన్ను ప్రోత్సహించి రష్యా, సోవియట్ యూనియన్ మీద దాడి చేయించడానికి పూనుకున్నాయన్నారు. స్టాలిన్ నాయక త్వాన 2 కోట్ల మంది ప్రజలు, సైన్యం తిరుగుబాటు చేయగా..30లక్షల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు ఈ పోరాటంలో 20లక్షల మంది యూదులను ఊచకోత కోశారని తెలిపారు. అయినా రష్యా ప్రజలు పోరాట శక్తిని ప్రదర్శిస్తూ హిట్లర్ ఫాసిజాన్ని ఓడించి జర్మనీలోని బెర్లిన్ నగరానికి హిట్లర్‌ను తరిమికొట్టి అక్కడ ఎర్రజెండా ఎగురవేశారని వివరించారు. ఎర్రజెండాను కనుమరుగు చేయాలనుకోవడం కాదన్నారు.
ఎర్రజెండా నాయకత్వంలో కార్మికులు, ప్రజలు కొట్లాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. మళ్ళీ 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చారని, సంఘాలు, సమ్మె హక్కులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని, విద్యా వైద్యం అందడం లేదన్నారు. హిట్లర్‌నే ఓడించిన శ్రామిక వర్గం, ప్రజలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలను సైతం ఓడిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీసిందని చెప్తున్న ముఖ్య మంత్రికి ఎన్నికల ముందు ఈ విషయం తెలి యదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలిచ్చారని, వాటిని అమలు చేయక పోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఉగ్రవాద చర్యలను సీపీఐ(ఎం) ఖండిస్తోందన్నారు. భారత్, పాకిస్తాన్‌కు మధ్య యుద్ధం కొనసాగుతుండగా ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచ దేశాలు సమైక్యంగా ఉగ్రవాదాన్ని అణచివేసి.. శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాన్ని, ప్రజలను చైతన్యం చేస్తూ, శ్రామికవర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు..
ఈ నెల20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జాన్‌వెస్లీ ప్రకటించారు. అదే విధంగా ఈనెల 30న రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టే ధర్నాలకు సైతం మద్దతు ప్రకటించారు. రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామెల్, జగదీష్, ఈ.నర్సింహ, జగన్, చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు ఆలంపల్లి నర్సింహ, శ్యామ్ సుందర్, కీసర సర్సిరెడ్డి, కిషన్, గోరెంకాల నర్సింహ, పి.జగన్, సుమలత, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
అందాల పోటీలు అవసరమా..?
ఓ వైపు భారత్, పాకి స్తాన్ మధ్య యుద్ధం కొన సాగుతుండగా హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహిం చడం సరికాదని జాన్‌వెస్లీ అభి ప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను దేశ ప్రజలు అసహ్యించు కునే పరిస్థితి కల్పించొద్దని ప్రభు త్వానికి సూచించారు. వెంటనే హైదరాబాద్‌లో జరగాల్సిన అందాల పోటీలను రద్దు చేయాలని కోరారు.
హిట్లర్ ఫాసిజాన్ని, సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించింది ఎర్రజెండానే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES